నా దేశం -నా స్వప్నం :ఉపోద్ఘాతం

 (ఈ దేశం- దేశంలోని రాష్ఠ్రాలు –పుణ్యక్షేత్రాలు –పోలీసు వ్యవస్థ –నగరాలు ఎలా ఉండాలి? అందుకు ప్రభుత్వాలు ఏం చెయ్యాలి అన్న సలహాల  సమాహారం)

కరోనా దెబ్బకు అగ్ర రాజ్యం తో సహా ప్రపంచ దేశాలు  అన్ని ఆర్థికంగా వెలవెలబోతున్నా  కేంద్ర ప్రభుత్వం సైతం  నిమ్మకు నీరెత్తినట్టు గా ఉన్నా -  కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం -  అంతకు పూర్వం గత ఐదు సంవత్సరాల అస్థిరత ఆ తరువాత 5 సం.లుగా కేవలం గ్రాఫిక్స్ కే  పరిమితమై ఉన్న పాలన  కేవలం  సొంత డబ్బా కోసం  ఖజానా కాళి  చేసినటువంటి పరిస్థితి అయినా సరే ..రాజధాని లేకున్నా ,   పది జిల్లాలు పోగొట్టుకున్నా ,ప్రత్యేక హోదా లేకున్నా -  ప్రత్యేక ప్యాకేజీ రాకున్నా అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని బేరేజు చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై  పచ్చ మీడియా , పచ్చ తమ్ముళ్లు మాత్రమే  కాకుండా కోర్టులు కూడా పగపట్టాయి.

 

ఈ బుక్లెట్లో  నేను పొందుపరచిన అంశాలు  చంద్రబాబు గారి  రెండవ రెజిమ్లోనే ఆయన గారిచే  అద్భుతం తగిన రీతిలో వాడుకుందామని కితాబు ఇవ్వబడినవే.  ఒక  వేళ ప్రభుత్వం ఈ అంశాలను  పరిశీలించి అమలు చేయడానికి పూనుకుంటే యథాప్రకారం బాబు గారు కోర్టులను  అడ్డం పెట్టుకొని అడ్డుపుల్ల వేస్తారేమో అని  ముందు జాగ్రత్త చర్యగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి నేను ఒక లేఖ పంపడం జరిగింది . (ఆ లేఖ పూర్తి పాఠం ఈ బుక్లెట్లో ఉంది )  

సమస్త రాష్ట్ర ప్రజానీకం బాగోగుల కొరకు పోరాడవలసిన బాబు గారు మందుబాబులు ,ఇసుక బకాసురులు, రాజధాని ప్రాంత భూస్వాములు ,లంచావతారాల కొరకు నానా తంటాలు పడుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి / అలానే వైయస్సార్ కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి  ఎలాగైనా తగువ  పెట్టాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు .ఇంకో అడుగు ముందుకు వేసి  జగన్మోహన్ రెడ్డి పై  హిందూ వ్యతిరేకి అనే ముద్ర వెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.

 గ్రౌండ్ లెవెల్ లో చూస్తే ప్రజలు ప్రభుత్వానికి , ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ- అభివృద్ధి పథకాలకు - సాగునీటి ప్రాజెక్టులకు అనుకూలంగానే ఉన్నారు . కానీ జగన్మోహన్ రెడ్డి  ప్రజా సంక్షేమం కొరకు ఖర్చు పెడుతూ ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటారు లేదా అప్పులు  చేసేస్తున్నారు బాబో !  అని రొమ్ములు బాదుకుంటున్నారు.  వారి నోరు మూయించడానికి  జగన్మోహన్ రెడ్డి  నవరత్నాలను  అభివృద్ధి పథకాలను సాగునీటి ప్రాజెక్టులను  ఏకబిగిన పూర్తి చేయటానికి ఆర్థిక వనరులు ఎంతో అవసరం.

  ప్రజలపై ఏ మాత్రం భారం వేయకుండా  ప్రభుత్వ నిర్వహణను  సరళీకృతం చేస్తూ తద్వారా నిర్వహణ వ్యయాన్ని గుదించుకుంటూ  వ్యూహాత్మకంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే  మార్గాలనే ఈ  బుక్లెట్లో ఇచ్చాను. వీటి అమలుకు నేను చేసిన కృషి - సీఎం  పేషి స్పందన  - రాష్ట్ర |శచివాలయంలో ని శాఖాధిపతుల చొరవ అన్నింటిని సీఎం గారికి నేను పంపిన తాజా లేఖ ద్వారా తెలుసుకోవచ్చు (పూర్తి పాఠం పొందు పరచాను).

 కాని క్రింది స్థాయికి వచ్చేసరికి ఆ ఉత్సాహం చొరవ పొరబడి  పోతున్న ఈ ఉదంతం సీఎం దృష్టికి వెళ్లాలనే ఈ బుక్ లెట్ ను  ప్రచురించి రాజకీయ రాజకీయేతర ప్రముఖులకు పంపాలని నిర్ణయించాను.   మీలో ఔత్సాహికులు  ఈ బుక్లెట్ను జిరాక్సులు చేసి గాని స్కాన్ చేసి గాని సీఎం గారి దృష్టికి వెళ్ళేంత వరకు జనబాహుళ్యానికి చేరవేయాలని కోరి ప్రార్థిస్తున్నాను.

గమనిక :

ఇవి 1992 సం.లోనే నాలో నాటుకు పోయిన నదుల అనుసంథానం సమిష్ఠి వ్యవసాయ అమలును సుసాధ్యం చేసేందుకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కొరకు  1995 లో రూపొందించిన అంశాలు.

కాల క్రమేణా అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ /స్ప్రెడ్ చేస్తూ వస్తున్నాను. ఈ బుక్లెట్ మొదట తాజాగా ఆంద్ర రాష్ఠ్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డిగారికి వ్రాసిన లేఖను /మరియు అడుగుడగున రాష్ఠ్ర ప్రభుత్వ సత్ప్రయత్నాలకు మోకాలడ్డుతున్న హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తిగారికి పంపిన లేఖను పొందుపరచాను.

లేటెస్ట్ అప్డేట్ కొరకు . మీ విమర్శలు అభిప్రాయాలను తెలుపుటకు సంప్రదించండి  : swamy7867@gmail.com  లేదా whatsapp: 9397036815  

చిత్తూరు మురుగేశన్

 

 

 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ

ఎకానమి పేకేజ్

TIRUMALA VISION 1900