ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ

 

గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ పూర్తి పాఠం ,

 

నమస్కరించి రాయునది ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పులు  చర్చనీయాంశమై ప్రాచుర్యం  పొందుతున్నాయి. ఈ తీర్పుల పై నాకు బిన్నాభిప్రాయం ఉన్నప్పటికి నాటి సుప్రీం కోర్ట్ జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ చెప్పిన “జుడిషియల్ యాక్టివిజం “ ఇదని సరిపెట్టుకుంటున్నాను.

 

ఈ నేపథ్యంలోనే నేను ఈ లేఖ తమకు పంపుతున్నాను. దీనిని రిట్ పిటిషన్ గా స్వీకరించి ప్రతిపక్ష నాయకుల కి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నోటీసులు జారీ చేస్తారు అని విశ్వసిస్తున్నాను. ఈ లేఖతో పాటుగా నా దేశం నా స్వప్నం అనే ప్రచురణను జాతా పరచాను .నా ప్రతిపాదనల ముఖ్య ఉద్దేశం వాటి అమలుకై నేను 1995 నుండి చేస్తున్నటువంటి  ప్రయత్నాలు అన్ని అందులోనే ఉన్నాయి .

 

ఇక్కడ మీ చొరవ - జోక్యం నా ప్రతిపాదనలు అమలుకి దోహద పడతాయి అన్న ఉద్దేశంతోనే ఈ లేఖను  తమకు పంపుతున్నాను. ఇప్పటికే  ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై ప్రాసెస్ మొదలు పెట్టింది కాబట్టి నెలకో- రెండు నెలలకో ఒక అవుట్ వచ్చే అవకాశం ఉంది. 

 

అయినా గత జూన్,29 నాడు వీటి పై ఒక ఎక్స్ పెర్ట్ కమిటి వెయ్యాలని కోరుతూ సి.ఎం గారికి మళ్ళీ ఒక లేఖ వ్రాసి యున్నాను. రొటీన్ ప్రాసెస్ ద్వార గాని లేదా నా మనవిని మన్నించి ఎక్స్ పెర్ట్ కమిటి వెయ్యడం ద్వారగాని నా ప్రతిపాదనలు అమలుకు నోచుకునే అవకాశం ఉంది .

 

అయితే  నాడు ముఖ్యమంత్రిగా ఉన్న దశలో నా ప్రతిపాదనలను తగిన రీతిలో వాడుకుంటామని లేఖ పంపిన నేటి ప్రతిపక్ష నేత వీటి అమలుకు మోకాలడ్డే అవకాశం లేక పోలేదు .(సతరు లేఖ ప్రతి జతపరచాను)

 

అందుకే తమరు ఇరువర్గాలకు నోటీసులు జారి చేసిన ఎడల కాలయాపన -కోర్టు వ్యవహారాలు వారించపడతాయని నమ్ముతున్నాను.

 

 నాపై దయ ఉంచి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నాకున్న చిత్తశుద్ధిని అర్థం చేసుకుని నా ప్రతిపాదనలు త్వరలో అమలయ్యేలా చూడాలని కోరుతున్నాను.

 ఇట్లు

 

 చిత్తూరు మురుగేశన్

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా దేశం -నా స్వప్నం :ఉపోద్ఘాతం

నేర నియంత్రణకు కొన్ని సూచనలు