విజన్ చిత్తూరు

 

విజన్ చిత్తూరు

 (జిల్లా కేంద్రమైన  చిత్తూరు నియోజక వర్గం & నగర అభి వృద్ది కొరకు కొన్ని సూచనలు ప్రతిపాదనలు)

+గతంలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి తరలించారు. వాటిని మళ్ళి చిత్తూరుకు తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.

+చిత్తూరు పట్టణ పరిదిలో బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి,సహకార డైరి తప్ప పెద్దగా ఉపాది కల్పించే ఫ్యేక్టరిలు లేవు. అందులోను సహకార డైరి మూతబడింది. దానిని ఎలాగన్నా మళ్ళి తెరిపించాలి. అలాగే బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి దాదాపుగా మూత పడినట్లే. కారణాలు ఏమైనప్పటికి చొరవ తీసుకొని ఫ్యేక్టరి గతంలో లాగా ఫుల్ స్వింగ్ లో ఉత్పత్తి చేపట్టేలా చూడాలి. ఫ్యేక్టరి కార్మికుల భవిష్యత్తును కాపాడాలి.

+జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఒక విశ్వవిద్యాలయం తెప్పిస్తే చాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాది లభిస్తుంది. చిత్తూరు ప్రాధన్యత పెరుగుతుంది

+టౌన్ బ్యాంక్ / కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల తరహాలో డెయిలి లోన్స్ ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి

+చిత్తూరు రూరల్ మండలం , గుడిపాల మండలం,చిత్తూరు పట్టణ నిరుధ్యోగులకు ఉధ్యోగవకాశం కల్పించే విదంగా మూడు పెద్ద ఫ్యేక్టరిలను ఆయ ప్రాంతాల్లో నెలకొల్పేలా చూడాలి. (Non polluting industries)

+ముందుగా నియోజక వర్గ పరిదిలోని నిరుధ్యోగ యువత బయోడేటాలను తెప్పించుకుని వారికి తగిన సాంకేతిక విథ్య,శిక్షణ లభించేలా చూడాలి. ఆ పై వారికి వ్రుత్తి,ఉధ్యోగ అవకాశాల కల్పనకు, రుణ సహాయానికి ఏర్పాటు చెయ్యాలి.

+తగిన ఉపాది,ఉధ్యోగవాకాశాలు లేక యువతలో అధిక సంఖ్యాకులు మద్యానికి భానిసలైయున్నారు. వారికి డి-ఆల్కహాలిక్ క్యేంపులు నిర్వహించాలి. జనావాస ప్రాంతాలనుండి మద్యం దుకాణాలను దూరం చెయ్యాలి. అమ్మకం వేళలను కుదించాలి

+చిత్తూరు నియోజిక వర్గ పరిదిలో జరుగుతున్న త్రాగు,సాగు నీటి ప్రాజెక్టులు సత్వరమే పూర్తి కావడానికి కృ షి చెయ్యాలి. అవసరమైతే రైతులు/ ప్రజల వద్దనుండి ఆర్థిక సహకారం కూడ తీసుకోవచ్చు (ఓ ఆరు నెలల వాటర్ బిల్స్ ముందుగా చెల్లిస్తే చాలుగా)

కార్పోరేషన్ కార్యాలయంలో మేయర్ చేంబర్ తో పాటుగా సిసి కేమరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ చెయ్యాలి

+కార్పోరేషన్ పరిదిలో పారిశుద్యం అద్వాన్నంగా ఉంది. సాధారణ పరిపాలన కూడ అంతంత మాత్రమే. కార్పోరేషన్ ఉధ్యోగులు చాలా మందికి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు,ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది ఆల్కహాలిక్స్ గా ఉన్నారు. ఈ అంశాలు వారి పని సామర్థయాన్ని భాగా దెబ్బ కొడుతున్నాయి. ఈ విషయాల పై చొరవ చూపి కార్పోరేషన్ యంత్రాంగాన్ని ప్రక్షాళణ చెయ్యవలసి ఉంది. కార్పోరేషన్ సిబ్బంది పని తీరును మెరుగు పరచాలి.

+ కార్పోరేషన్ ఉధ్యోగులకు వైద్య పరీక్షలు చెయ్యించి ఉచిత వైద్య సౌఖర్యం కల్పింఛాలి. ఆలాగే వారికి వారి కుటుంభ సభ్యులను ఉత్సాహ పరచి మోటివేట్ చేసేవిదంగా కౌన్సిలింగ్,గెట్ టు గెదర్ ప్రోగ్రాములు,టూర్స్ ఏర్పాటు చెయ్యాలి.ప్రైవేటు రుణ వత్తిళ్ళనుండి ఉపసమనం కల్పీంచాలి.

+ట్రాఫిక్ ను అస్త వ్యస్తం చేస్తున్న ఆక్రమణలను పార్టీలకు అతీతంగా తొలగించాలి. హార్ట్ ఆఫ్ ది టౌన్ను గుర్తించి త్రీ /ఫోర్ వీలర్సుల రాక పోకలను నిషేదించాలి. బయిట ప్రదేశాలకు వెళ్ళే వాహనాలు టౌన్ లోని కి రాకుండా చూడాలి

+ వేస్ట్ మ్యేనేజ్మెంట్ చెత్తలనుండి ఎరువుల తయూరి/ విద్యుత్ తయారీల పై దృష్ఠి సారించాలి

+డాబాల పై పడే వర్షపు నీటిని పివిసి పైప్ ద్వారా సేకరించి మెగా ఇంకుడు గుంతల్లోకి వెళ్ళేలా చూడాలి

+పట్టణ నడిబొడ్డున ఉన్నరాములవారిగుడి ఉత్సవాల పునరుద్ద్రణ పై ద్రుష్ఠి సారిస్తే ఆస్తికుల మన్నెనలు పొందుతారు.

+నూటికి ఐదు పది వడ్ది వసూళ్ళపై ఆంక్షలు కఠిన చర్యలు. జాతీయ బ్యాంకులు సైతం డైలి లోన్ ఇచ్చేలా వత్తిడి చెయ్యడం

+పాత బస్ స్టాండు పరిసర ప్రాంతాల్లో త్రోపుడు బండ్ల వలన ట్రాఫిక్ సమస్యలే కాక ఈవ్ టీజింగ్ సమస్యలు కూడ వస్తున్నాయి. పాత బస్ స్టాండు పై సీలింగ్ ఏర్పాటు చేసి దాని పై వారికి నిరంతర షాపులు నిర్మించి ఇవ్వవచ్చును.

 

 

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ

నా దేశం -నా స్వప్నం :ఉపోద్ఘాతం

నేర నియంత్రణకు కొన్ని సూచనలు