మోదిజికి పంపిన సలహాలు

 

మోదిజికి పంపిన సలహాలు 

 (మన భారత దేశం ,దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు సహేతుక పరిష్కారాలు కూర్చి మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదిగారికి పంపి ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా “కెప్ట్ ఆన్ రెకార్డ్” అని యాబై ఒక్క రూపాయలు వెచ్చించి మరి ఉత్తరా ముఖంగా తెలిపిన నా సలహాలను   సంకలనం ఇది. వీటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించేలా మీరు చొరవ తీసుకుంటే ఈ దేశమే మీకు రుణ పడి పోతుంది ఇంతే కాదు వీటిలో రాష్ఠ్ర స్థాయిలో అమలు చేయ గల అంశాలను మీరు అమలు చేసినా రాష్ఠ్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది మీ నవరత్నాలను విడతల వారిగా కాదు ఒక్క సారిగా అమలు చేయ వచ్చు )

 

భాగం:1

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో సింహ భాగం రుణాలు,రుణాల పై వడ్డీలు ,చక్కిర వడ్డీలు చెల్లించడానికే సరి పోతుంది .కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని విదేశి రుణాలను తీర్చి వేయ కలిగితేనే ఆది కష్ఠం అంత సు:ఖంలా  సత్ఫలితాన్ని ఇస్తుంది.

అ) రాష్ఠ్రపతి ,గవర్నర్ పదవుల రద్దు -వారి పాత్రను సుప్రీం కోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు పోషించగలరు .

ఆ)రాష్ఠ్రపతి భవన్,పార్లెమెంట్ భవనం,ప్రధాన మంత్రి అధికారిక నివాసం,రాష్ఠ్రాల్లోని గవర్నర్ భవన్లు ,అసెంబ్లి భవనాలు,సి.ఎంల అధికారిక నివాసాలు -వీటన్నింటిని గ్లోబల్ టెండర్ పిలిచి లీజుకు ఇచ్చి వేయడం

గమనిక: భవిష్యత్తులో సమావేశాలు వీడియో కాన్ఫ్రెన్సు పద్దతినే జరుగుతాయి కాబట్టి విర్చువల్ కార్యాలయాలు నడుస్తాయి కాబట్టి ఇవి సుసాధ్యమే

ఇ)స్విడ్జర్లాండ్ భ్యాంకు తరహాలో మన దేశంలోను ఒక బ్యాంకు స్థాపిస్తే విదేశాల్లో మొరుగుతున్న నల్లదనం తనంతట తనే రెక్కలు కట్టుకుని స్వదేశం చేరుతుంది

ఈ)వాహనాలకు పెట్రోలుతో పాటు ఎథనాల్ 60:40 నిష్పత్తిలో వినియోగించే ఎసలు బాటు. లగ్జరి కార్లకు డీజల్ పై రాయితీ రద్దు.

ఉ) వారానికి ఒక దినాన్ని కాలుష్య వ్యతిరేక దినంగా ప్రకటించి  బస్సులు,రైళ్ళు మినహా అన్ని వాహనాల రాక పోకలను నిషేదించడం ( రక్ష,వైద్య,అత్యవసర సేవలకు మినహాయింపు)

ఎ)దేశంలోని 18+వయస్సుగల ప్రతి పౌరునికి ఉచిత సైకిళ్ పంపిణి -సైకిళ్ళకు మెయిన్ ట్రాక్

ఏ)వ్యభిచారానికి చట్ట బద్దత

భాగం:2

కేంద్ర బడ్జెట్లో రుణాలు,వడ్డీలు కాకుండా అత్యధిక దనం కేటాయింప పడేది రక్షణకే. దీనిని ఎదోలా తగ్గించుకోకలిగితేనే  దేశ ప్రగతి సాధ్యం

అ)పాక్,చైనా,బంగ్లాదేశ్ వివాదస్పదం చేస్తున్న భారత భూభాగాలను ఐక్య రాజ్య సమితి కార్యకలాపాలకు మాత్రం పరిమితం చేసి సతరు భూభాగం యొక్క రక్షణను ఐరాస శాంతి పరిరక్షణ దళం  గైకొనేలా చూడడం.

ఆ)నక్సల్ ప్రభావిత ప్రాంతాల నిర్వహణ,ప్రభుత్వ ప్రగతి/సంక్షేమ పథకాల అమలును నక్సల్సు మద్దత్తు దారులుగా ముద్రపడిన పౌర హక్కుల సంఘాల వారికి అప్పగించడం.

భాగం: 3

ప్రభుత్వ యంత్రాంగంలోని నిర్లక్ష్యం అవినీతి భాద్యతారాహిత్యాలను అరి కట్టి ప్రభుత్వ నిర్వహణా వ్యాయాన్ని కనీశం 50 శాతం మెరకు తగ్గింఛాలి.

అ)కేంద్ర రాష్ఠ్ర ప్రభుత్వ ఉధ్యోగులందరికి వైద్య,సైకో మెట్రి పరీక్షలు నిర్వహించాలి.గత 10 సం.ల్లో చోటు చేసుకున్న మార్పులు గత 10 సం.ల్లో చోటు చేసుకోనున్న మార్పుల పై ఒక వివేదిక ప్రచురించి అందులోను పరీక్షలు న్రివహించాలి. వీటిలో అనర్హులుగా తేలిన వారికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇవ్వాలి.(వారి వారసుల్లో అర్హులైన వారికి ఉధ్యోగవకాశం కలిపించ వచ్చు)

ఆ)ప్రస్తుత ఖాళిలు -పై తెలిపిన పరీక్షల కారణంగా ఏర్పడిన ఖాళీలకు అభ్యర్దులను టెండర్ల ద్వారా మాత్రమే పూరించాలి. అంటే కావల్సిన అర్హత ఉండి తక్కువ జీతానికి పని చేయడానికి ముందుకొచ్చే వారికి ప్రాధాన్యత.

ఇ)శని ఆదివారాలు ,స్వాతంత్రయ దినోత్శవం మినః అన్ని శెలవులను రద్దు చెయ్యాలి సం.లో 11 నెలల పాటు నిరాటకంగా పని చేసిన వారికి మాత్రం నెల రోజుల శెలవు+జీతం

ఈ)చెరువులు,ఏర్లు,కొలములు,జలాశయాలను ఆక్రమించిన వారి వివరాలను సేకరించి సైన్యం చే తగు కఠిన చర్యలు (ఆక్రమణల తొలగింపు+ఖైదు).లింకింగ్ చానల్సును ఆక్రమించిన వారు తమ భవనాలకు యు.జిలో వాటిని పునరుద్దరించే అవకాశం .వీలు కాకుంటే కూల్చి వేయడం.ఈ వ్యవహారాల్లో ఎదురయ్యే వ్యవహారాలను పరిష్కరించడానికి  Fast Track special courts ఏర్పాటు

ఉ)ప్రతి పౌరుడు ఆన్లైన్ ద్వారా తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వానికి అంద చేసే ఏర్పాటు (సాముహిక,ఆర్థిక స్థితిగతుల పై)  ఎటువ్ంటి క్రాస్ చెక్ చెయ్యకనే వీటి ఆధారంగా ప్రభుత్వ ప్రగతి /సంక్షేమ పథకాల రూప కల్పన. (అయితే 3 నెలల లోపు ర్యేండమ్ స్యాంపుల్ ప్రాతిపదికన ఫీల్డు చెక్ అప్ చేయాలి .తప్పుడు సమాచారం ఇచ్చిన వారి పై క్రిమినల్ చర్యలు -ఈ విషయాన్ని ముందుగానే తగు రీతిలో తెలపడం ముఖ్యం)

ఊ)రోడ్ల నిర్మాణం కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలతోనే జరిగే ఏర్పాటు.

రు)కోర్టులు 365 రోజులు,16 గంటలు పని చేసే ఏర్పాటు. ఏ సిబ్బందైనా 8 గం.లకు మించి పని చెయ్యకుండా అదనపు సిబ్బంది నియామకం. షిఫ్టు పద్దతి.

రూ) మత సంస్ఠలు కాలక్రమంలో మతపరమైన కార్యకలాపాలను తగ్గించుకుని దేశ ప్రగతికి సహకరించే ఏర్పాటు. ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో

పెద్ద ఆలయాలు,మఠాలు,ప్రార్ఠనా మందిరాలు సోలార్,విండ్ మిల్ ద్వారా విద్యుత్ ,బయోగ్యాస్ యూనిట్లతో గ్యాసు జెనరేట్ చేసి సతరు ఊళ్ళకు విద్యుత్/గ్యాసు  సరఫరా చేసే ఏర్పాటు. సాముహిక వంట శాలలు-వాటికి గ్యాస్ సరఫరా.

ఎ)స్థానిక కూరగాయల మార్కెట్,చేపల మార్కెట్ ఎదురుగా నాటి ఎస్.టి.డి బూత్ తరహాలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు/ఫుట్ పాత్ వ్యాపారులకు డి.ఎల్ (డెయిలి లోన్) అందించే ఏర్పాటు.

భాగం:4

అ)దేశంలోని 10 కోట్ల మంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం -సతరు సైన్యం చే నదుల అనుసందానం.  జలమార్గ రవాణాకు అనువుగా కాల్వల నిర్మానం.

ఆ)గ్రామ పరిది మొదల్గొని రైతు సంఘాల ఏర్పాటు. వ్యవసాయ పొలాలను సతరు సంఘానికి లీజు ప్రాతిపదికన అప్ప చెప్పి సమిష్థి వ్యవసాయం.

ఇ)సైన్యం,ప్రత్యేక సైన్యంలో ఒక విభాగం చే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అవసరమైన గిడ్డంగులు, కోల్డు స్ట్రోరేజిల నిర్మాణం. వ్యవసాయ ఉత్పత్తుల  రవాణాకు అవసరమైన రోడ్లు,రైల్వే లైన్ల నిర్మాణం.

ఉ)నదుల అనుసంథాన కార్యక్రమంలో పెట్టుబడి పెట్టే విదేశి వ్యాపార సంస్థలకు మాత్రమే భారత దేశంలో వ్యాపార అవకాశాలు.

ఊ) సంపూర్ణ మద్యపాన నిషేదం -ఆల్కహాలిక్సుకు కొకొ కోలా మెషిన్ తరహాలోని యంత్రాల ద్వార కాస్టు ప్రైజుకే మద్యం.

రు) ప్రతి విథ్యార్ది తన శరీరం ,మనస్సు,బుద్ది ,కుటుంభం,సమాజం,రాష్ఠ్రం,దేశం,ప్రపంచం గురించిన అవగాహణ పొంది తన కాళ్ళ పై తాను నిలబడి కుటుంభం మొదల్గొని దేశం దాక తన భాద్యతల్ని నిర్వర్తించేలా తీర్చి దిద్దే విద్యా విదానం

ఎ)విద్య అందించిన సంస్థకే విథ్యార్దికి ఉధ్యోగం తెచ్చి పెట్టే భాధ్యత.

ఏ)కలుషిత వ్యర్దాలను నదుల్లోకి /సముద్రంలోకి విడిచి పెట్టే పరిశ్రమలకు నిషేదం

ఒ) విద్యుత అవసరాలలో  కనీశం 50 శాతం సోలార్/విండ్ మిల్/బయోగ్యాస్ ద్వారా సమీకరించుకునే ఏర్పాటు

ఓ)పోలీసు శాఖలో ఖాళీలను తక్షణం పూరించడం -అలానే ప్రస్తుతం ఉన్న ఉధ్యోగాల సంఖ్యను మూడింతలుగా పెంచడం .షిఫ్టు పద్దతి అమలు చేయడం.ప్రతి పోలీస్ స్టేషన్లోను సి.సి.కేమరాల ఏర్పాటు+ వెబ్ కాస్టింగ్

పోలీసు శాఖ ప్రాధమిక దర్యాప్తు,కేసు నమోదుకే పరీమితం. కోర్టుల్లో నేరాలను రుజువు చేసేందుకు ప్రత్యేక సంస్థ ఏర్పాటు.

గమనిక:

ఇందాక చెప్పిన అంశాలను అమలు చేయడం -చేసాక రాజ్యాంగ సవరణ చేసి ప్రధానిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే విదానానికి శ్రీకారం.ప్రధానికి వీటో  పవర్.

ఎన్నికల్లో పార్టిలకు లభించిన ఓట్ల శాతం ప్రాతిపదికన ఎం.పీలను నామినేట్ చేసుకునే వీలు.ప్రతి పార్టి అన్ని స్థానాలకు తమ అభ్యర్దులను ముందుగానే ప్రతిపదించాలి. ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే ఉప ఎన్నికలకు వెళ్ళకుండా తమ అభ్యర్దుల పట్టికలోని తదుపరి అభ్యర్దిని ఎం.పి గా ప్రతిపాదించ వచ్చు.

నూరు శాతం పోలింగ్ జరిగేంతవరకు మ్యేన్ లెస్ పోలింగ్ కేంద్రాలు కొనసాగాలి .ఓటిచ్చిన ఓటరుకు రశీదు ల్యేమినేట్ చేయబడి అందే ఏర్పాటు ,సతరు రశీదులో ఓటు వేసిన తేది/సమయం నమోదై ఉండాలి .

ప్రభుత్వ  ఉధ్యోగాలు/ దేశ ప్రగతి /సంక్షేమ పథకాల్లో ముందుగా ఓటిచ్చిన వారికే అధిక ప్రాధన్యత

 

 

 

 

 

 

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ

నా దేశం -నా స్వప్నం :ఉపోద్ఘాతం

నేర నియంత్రణకు కొన్ని సూచనలు