ఆంద్రప్రదేశ్ రాష్ఠ్ర ముఖ్యమంత్రిగారికి నా తాజా లేఖ

 

గౌరవనీయులైన అయ్యా !

విషయం :

రాష్ఠ్ర ఆర్థిక దుస్థితి మెరుగుకు ప్రయత్నాలు - ఒకే విడతలో నవరత్నాల అమలు -   దేశంలోని రాష్ఠ్ర ప్రభుత్వాలు -ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల పై భారం మోపక నిర్వహణా వ్యయాన్ని కుదించుకుని  అర్థికంగా పుంజుకోవడం - సంస్కరణల సమాహారం - ఎకానమి ప్యేకేజి సి.ఎం.ఓ ఆర్థిక శాఖ ప్లానింగ్ శాఖ స్పందనలు ఎక్స్ పెర్ట్ కమిటి - Request Regarding

- 0  -

నేను ఎన్.టి.ఆర్ అభిమానిని వెన్ను పోటుతో ఎన్.టి.ఆర్ని పన్ను పోటుతో ప్రజలను చంపుకు తిన్నాడు కాబట్టి చంద్రబాబు వ్యతిరేకిని. చంద్రబాబును దెబ్బ కొట్ట గల సమర్థుడు కాబట్టి వై.ఎస్.ఆర్ మద్దత్తు దారుడ్ని అయ్యాను. 2004 ,2009 ఎన్నికల్లోను ప్రత్యక్షంగాను అంతర్జాలం లోను  కాంగ్రెస్ పార్టి విజయానికి కృషి చేసినవాడ్ని .

 

మీరు అదిష్థానంతో విభేదించిన నాటినుండి మీ వ్యూహాల పై  ఎన్ని విమర్శలున్నా మనస్పూర్తిగా మీకు సంఫూర్ణ మద్దత్తు ఇస్తూనే వచ్చాను .

 

ఎన్.టి.ఆర్ మానవీయ పరిపాలనను వై.ఎస్.ఆర్ తన దూకుడు విదానంతో మరో స్థాయికి తీసుకెళ్ళారు కాబట్టి వై.ఎస్సార్ అభిమానిని అయ్యాను. మీరు పేదవాని కోసం  నా  తండ్రి ఒకడుగు ముందుకేస్తే నేను  రెండు అడుగులు వేస్తానన్న విదానం నాకు బాగా నచ్చింది. మీ పై విశ్వాసంతో అభిమానంతో అంతర్జాలంలో మీ పార్టి విజయానికి నా వంతు కృషి చేసాను. 2014 ,2019 ఎన్నికల్లోను ఇదే పంథా కొనసాగించాను .కొనసాగిస్తున్నాను .కొనసాగిస్తాను .

మన కృషి ఫలించింది .ప్రభుత్వ పగ్గాలు నేడు మీ చేతుల్లో ఉన్నప్పటికి ప్రతిపక్షాల కుట్రలు న్యాయ స్థానాల మోకాలడ్డు ఆర్థిక వనరుల కొరతలకు ఎదురీదుతూ సరి కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. అయితే ...

రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందుల్లో ఉన్నమాట తమకు విధితమే. ప్రస్తుతం కరోనా  నేపథ్యంలో మరిన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి .ప్రజలపై భారం మోపకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు +తద్వారా తమ నవరత్నాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమలు పరచటానికి  చేపట్టవలసిన నిర్వహణ  సంస్కరణలు మరియు చర్యలను క్రోడీకరించి తమ కార్యాలయానికి పంపడం జరిగింది .(2019,మే)

 

దానిపై  ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని తెలుపు కోరుతూ నేను తమ కార్యాలయాన్ని   6-6 - 2019 న   ఆర్ టి ఐ ప్రకారం కోరగా నా లేఖ మరియు సతరు లేఖ + నా ప్రతి పాదనలను ఆర్థిక శాఖకు నివేదించినట్లు గా 31 -1 2020 నాటి లేఖ ద్వారా తెలిపేరు. (సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను )

 

ఈ విషయమై నేను ఆర్థిక శాఖ వారిని ఆర్.టి.ఐ ప్రకారం సంప్రదించగా  నా లేఖ + ప్రతి పాదనలను

1 ప్లానింగ్ శాఖ 2 రెవెన్యూ దేవాదాయ శాఖ 3 హోం శాఖ 4 టి ఆర్ అండ్ బి శాఖ 5 జి (ఎ) సర్వీసెస్ శాఖలకు పరిశీలన నిమిత్తం పంపినట్లు తేదీ 4-3- 2020 నాటి  లేఖలో నాకు తెలిపారు.( సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను)  పై శాఖల వారు నా లేఖ+ప్రతిపాదనల పై ఏం చేసారో క్లుప్తంగా తెలియ చేస్తున్నాను .

 

1.ప్లానింగ్ డిపార్ట్మెంట్:

వీరు తమ 11 /3 /2020 నాటి  లేఖలో నా లేఖ మరియు  ప్రతి పాదనలను తదుపరి చర్యల నిమిత్తం చిత్తూరు కలెక్టర్ వారికి పంపినట్లు తెలిపారు. ( సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను)

 

 2. హోమ్ డిపార్ట్మెంట్

 వీరు నా సలహాలు మరియు ప్రతి పాదనలను రాష్ట్ర డిజిపి గారికి పంపినట్లుగా 6/3/ 2020 నాటి లేఖలో తెలిపారు (సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను )

 

3 .టి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ :

వీరు ఆర్థిక శాఖ వారు  పంపిన నా లేఖ + ప్రతి పాదనలు  తమ కార్యాలయానికి అందలేదని 6/ 3/ 2020 నాటి లేఖలో  తెలిపారు (సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను)  నేను కాలయాపనను  వారించడం కొరకు వారం రోజుల్లో నా సలహాలను ప్రతి పాదనలను వెంటనే వీరికి  పంపాను.

 

 ఇప్పటికే విలువైన ఐదు  నెలల కాలం గడిచిపోయి నందున తమకు    లేఖ రాయవలసి వచ్చినది.  గత 5 నెలల  కాలంలో లాక్ డౌన్ మరియు కరోనా కట్టడి పై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారిస్తున్న కీలక విపత్కర పరిస్థితుల్లో  ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టకూడదని మౌనంగా వేచి ఉన్నాను.

 

ఇంతకీ ఆర్థిక శాఖ  ద్వారా నా  లేఖ+ ప్రతి పాదనలను అందుకున్న శాఖలు/ శాఖాధిపతులకు  సైతం లేఖ ద్వారా కూడా సంప్రదించలేదు.  ఈరోజున తమకు పంపుతున్నట్లు గానే వారికి కూడా లేఖలను పంపుతున్నాను . ( నా లేఖ పై స్పందిస్తారో లేదో ? ఒక స్పందించినా ఎప్పుడు స్పందిస్తారో ? తెలీదు. నిజానికి వీరు నా ప్రతిపాదన అమలు యొక్క సాధ్యా సాధ్యాల పై తమ అభిప్రాయాలను ఇప్పటికే ఆర్థిక శాఖకు తెలియ చేసి ఉండాలి. అలా తెలియ చేసి ఉంటే నాకూ  కాపి మార్క్ చేసి ఉంటారు.

 

రాష్ట్ర అభివృద్ధి - సంక్షేమం  పై చిత్తశుద్ధితో తమరు అహర్నిశం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయంలో చాలా భాగం నిర్వహణ వ్యయానికే ఖర్చు అయిపోతున్నది . చాలీచాలని వనరులతోనే  రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందుతోంది అంటే ఆపై నా సలహాలు ప్రతి పాదనలు అమలైతే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం జోరందుకున్నాయి.

 

కావున నా పై దయ ఉంచి ఈ విషయమై చొరవ తీసుకుని పై తెలిపిన / ఈ లేఖతో పాటు జతపరుస్తున్న ప్రతిపాదనల పై ఒక ఎక్స్ పెర్ట్ కమిటి వేసి వారి సూచనలు తీసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని అమలు చెయ్యండి.

 

ఇప్పటికే నాకు 53 సం.ల వయస్సు. ఈ ప్రతిపాదనలను 1995 నుండి మన ప్రభుత్వాలకు పంపి రిమైండ్ చేస్తూ అలసి పోయాను. నాకింకా ఓపొక లేదు కాబట్టి భారాన్ని మీ మీదకు నెట్తి వేస్తున్నాను. దయ చేసి అర్థం చేసుకుని సత్వరమే చర్యలు తీసుకోగలరు.

ఇట్లు

చిత్తూరు.మురుగేశన్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిన లేఖ

నా దేశం -నా స్వప్నం :ఉపోద్ఘాతం

నేర నియంత్రణకు కొన్ని సూచనలు